హరీష్ శంకర్ తరువాత చేయబోయే సినిమా ఆయనతోనేనా…?

Published on Feb 16, 2020 1:11 am IST

వరుస విజయాల దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతానికి త్వరలో పవన్ కళ్యాణ్ తో చేయబోయే చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ పనులతో బిజీగా కాలం గడుపుతున్నాడు. కాగా గతంలో వీరి కలయికలో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ ఎంతటి ఘనవిజయాన్ని నమోదు చేసుకుందో మనందరికీ తెలిసిందే. కాగా వీరి తాజా చిత్రంతో మళ్ళీ అదే మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి దర్శకుడు హరీష్ శంకర్ తీవ్రంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే వీరి కలయికలో వచ్చే సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని పవన్ కళ్యాణ్ అభిమానులు అందరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక అసలు విషయం ఏంటంటే… దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ తో సినిమా చేసాక, తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నానని స్పష్టం చేశారని సమాచారం. అయితే అన్ని అనుకున్న విధంగా జరిగితే హరీష్ శంకర్, చిరంజీవిల చిత్రం వచ్చే ఏడాదిలో ప్రారంభమవనుందని సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబందించిన ఒక అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

X
More