పూజా హెగ్డే అంత డిమాండ్ చేయలేదట !

Published on May 4, 2019 11:45 am IST

ప్రస్తుతం టాలీవుడ్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా వుంది పూజా హెగ్డే. ఈ హీరోయిన్ తాజాగా మరో క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న వాల్మీకి చిత్రంలో నటించడానికి పూజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక ఈ చిత్రం కోసం పూజా 15రోజులు తన డేట్స్ ఇచ్చినందుకు గాను ఏకంగా 2కోట్ల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తల ఫై హరీష్ స్పందించాడు. ఆమె 2 కోట్లు అడిగింది అని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

కాగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో పూజా హెగ్డే, డీజే తరువాత ఇది రెండవ సారి నటించనుంది. సూపర్ హిట్ కోలీవుడ్ మూవీ జిగర్ తండా కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ , అథర్వ మురళి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More