యంగ్ హీరోతో సినిమా చేయనున్న హరీష్ శంకర్ !
Published on Feb 22, 2018 9:33 am IST

ఇటీవలే ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన దర్శకుడు హరీష్ శంకర్ దిల్ రాజు నిర్మాణంలో ఇద్దరు యువ హీరోలతో ‘దాగుడు మూతలు’ అనే మల్టీ స్టారర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. ఈ చిత్రం పూర్తికాగానే అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్లో ఒక సినిమా చేయనున్నాడు ఈ దర్శకుడు.

ఈ చిత్రానికి ‘సీటీమార్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్ర పాటల్లో బాగా పాపులర్ అయిన ‘సీటీ మార్ సీటీ మార్’ పాట నుండి ఈ టైటిల్ ను తీసుకోవడం జరిగిందట. ఇకపోతే ఈ చిత్రంలో ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న యువ హీరోనే నటిస్తాడట. మరి ఈ హీరో ఎవరో తెలియాలంటే ఈ చిత్రానికి సంబందించి పూర్తి వివరాలు వెల్లవడే వరకు వేచి చూడాల్సిందే.

 
Like us on Facebook