శివాలయాలలో ‘హరోంహర’ పుణ్యధ్వనులు చేస్తున్న రోజా

శివాలయాలలో ‘హరోంహర’ పుణ్యధ్వనులు చేస్తున్న రోజా

Published on Nov 14, 2019 1:22 PM IST

Harom Hara Book written by puranapanda srinivas presented by roja ,mla

చిత్తూరు: నవంబర్: 14

తెలుగు రాష్ట్రాలలో ఈ కార్తీక మాసంలో నగరి ఎమ్మెల్యే రోజా ప్రచురించిన ‘ హరోం హర ‘ హాట్ టాపిక్ గా మారి వేలకొలది శివ భక్తుల్ని ఆకర్షిస్తోంది. ఈ అపూర్వ గ్రంధానికి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలంకర్త కావడం మరొక అద్భుతమైన విశేషం. గుజరాత్ ప్రభాస తీర్ధంలోని సోమనాదక్షేత్రంలో , శ్రీశైల మల్లికార్జున మహాలింగం సమక్షంలో, ఉజ్జయినీ నగరం మహాకాళేశ్వర సన్నిధానంలో, నర్మదా నదీతీరంలో ఓంకారేశ్వర మహాక్షేత్రంలో , మహారాష్ట్రలోని వైద్యనాధుని వద్ద, భీమానదీతీరంలోని భీమశంకరా దివ్యలింగం దగ్గర,రామేశ్వరంలోని రామనాథేశ్వరుని వొడిలో, జాంనగర్లోని నాగేశ్వర లింగం వద్ద, కాశీక్షేత్రంలోని విశ్వనాధుని సన్నిధిలో, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుని వద్ద, హిమాలయ పర్వత సానువుల్లో గృష్ణేశ్వర లింగం వద్ద, జమ్మూ కాశ్మీర్లోని అమరనాధ్ మహిమోపేత లింగం సన్నిధానంలో , నేపాల్లోని పశుపతినాధుని వద్ద శివ భక్తులు రోజూ చేసే ముఖ్య స్తోత్ర, మంత్ర అర్చనా, అభిషేకాల వైభవ మంత్రాలతో నగరి ఎమ్మెల్యే శ్రీమతి రోజా ప్రచురించిన అపురూప గ్రంధమే ‘ హరోం హర’

శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనకర్తగా వ్యవహరించిన ఈ అద్భుత ‘ హరోం హర ‘ గ్రంధానికి నగరి ఎమ్మెల్యే సమర్పకురాలిగా వ్యవహరించడమే కాకుండా ఈ గురువారం ఉదయం పుత్తూరు శివాలయంలో రోజా తానే స్వయంగా ఆవిష్కరించడం విశేషం. శివార్చన చేసుకునే వారికి, శివ లింగానికి అభిషేకం చేసుకునే వారికి, శివ స్తోత్రాలు పారాయణం చేసుకునే వారికి, నమక చమక పారాయణలతో తరించాలనుకునే వారికి చాలా చక్కగా ఉపయోగ పడేలా ఈ పుస్తకాన్ని తన వ్యాఖ్యాన వైఖరీ దక్షతలతో ప్రముఖరచయిత పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనం చేయడం వల్ల ‘ హరోం హర’ దివ్య గ్రంధాన్ని తానే స్వయంగా అనేక శివాలయాకు వెళ్లి పంచుతున్నట్లు రోజా చెప్పారు. హైదరాబాద్, విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాలలో ఇప్పటికే శివ భక్తుల తాకిడితో విపరీతమైన స్పందన లభించిన ఈ ‘హరోం హర ‘ పుస్తకాన్ని ఎమ్మెల్యే రోజా నగరి భక్తులకు ఉచితంగా ఇవ్వడం పట్ల వందల కొలది భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూర్ జిల్లా చరిత్రలో ఇలాంటి దైవీయ చైతన్యపు ధార్మిక గ్రంథ సేవ ఎవ్వరూ చెయ్యలేదని, రోజా మేడమ్ ఇంతటి పవిత్ర సేవ చెయ్యడం మాకు సంతోషాన్నిస్తోందని ధార్మిక సంస్థల ప్రతినిధులు, శివాలయాలు అర్చకులు, ధర్మకర్తలు అభినందనలు వర్షించడం మరో విశేషం. తాను నిమిత్తమాత్రురాలనని, పరమేశ్వరుని అనుగ్రహ విశేషంవల్లనే ఈ దైవఘటన ‘ హరోం హర’ గా సాహితీమిత్రులు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కలం నుండి అపురూపంగా సాక్షాత్కరించిందాని శ్రీమతి రోజా వినయంగా చెప్పడం సభికులని ఆకట్టుకుంది. హాజరైన భక్తజనం అందరూ ‘ హరోం హర’ గ్రంధాన్ని స్వీకరించి , రోజమ్మ ఎంత మంచి పుస్తకం ఇచ్చిందంటూ ఆనందంతో ‘ శివార్పణమ్’ గా వెళ్లడం గమనార్హం. తాను ఈ పుస్తకానికి సమర్పకురాలిని కావడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు శ్రీమతి ఆర్కే రోజా.

puranapanda-srinivas-book-harom-hara-presented-by-r.k.roja-mla

ROJA AND PURANAPANDA SRINIVAS

సంబంధిత సమాచారం

తాజా వార్తలు