ఈవీవీ సినిమా, ఎన్‌వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త నిర్మాణంలో హర్ష్ రోషన్, ప్రియాంక ఆచర్ జంటగా నూతన చిత్రం ప్రారంభమైంది. ఈవీవీ సినిమా బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.10గా, ఎన్‌వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.
నిజ జీవిత కథ ఆధారంగా ఒక ఇంటెన్స్ లవ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు అరుణ్ బాలాజీ, శ్రీ రంజని సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఈ.వీ.వీ. సత్యనారాయణ తనయుడు ఆర్యన్ రాజేష్, మరో నిర్మాత ఎన్.వి. కృష్ణారెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి జిజు సన్నీ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, వినీల్ నల్లమిల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మడూరి మధు పీఆర్వోగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ తెలిపింది.


