బన్నీ మూవీలో రావ్ రమేష్ పాత్రని ఆయన భర్తీ చేశారట

Published on Jul 31, 2019 2:48 pm IST

బన్నీ ,త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ కొరకు ఓ క్లాసిక్ టైటిల్ ఎంపిక చేసివుంచారట దర్శకుడు త్రివిక్రమ్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన జులాయి,సన్ ఆఫ్ సత్యమూర్తి మంచి విజయం సాధిచడంతో తాజా చిత్రంపై అంచనాలు బాగా ఉన్నాయి.

ఐతే విలక్షణ నటుడు రావు రమేష్ ఈ మూవీ నుండి అర్థాంతరంగా తప్పుకున్నారని సమాచారం. కొన్ని అనివార్య కారణాలతో రావు రమేష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని తెలుస్తుంది. ఐతే తాజాగా రావు రమేష్ వదిలి వెళ్లిన పాత్రను “అమృతం” ఫేమ్ హర్షవర్దన్ తో చేయిస్తున్నారని సమాచారం. “అమృతం” కామెడీ డైలీ సీరియల్ తో ప్రాచుర్యం పొందిన హర్షవర్ధన్ కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశారు. అలాగే అనేక చిత్రాలలో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆరిస్ట్ గా చేయడం జరిగింది.

కాగా ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా టబు, సుశాంత్, నివేత పేతురేజ్, నవదీప్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :