‘మనం’ సినిమాకి డైలాగ్స్ రాయనున్న హర్షవర్ధన్

Published on Apr 28, 2013 1:36 am IST

Harsha-vardhan
యాక్టర్, రైటర్ అయిన హర్ష వర్ధన్ కెరీర్ ఇప్పుడిప్పుడే మరింతగా ఊపందుకుంటోంది. ఇటీవలే హర్షవర్ధన్ నితిన్, నిత్యా మీనన్, ఇషా తల్వార్ హీరో హీరోయిన్స్ గా నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాకి డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాసాడు. ఆ సినిమా చూసిన అందరూ హర్ష పనితనాన్ని మెచ్చుకున్నారు.ఈ సినిమా విజయంతో హర్ష వర్ధన్ ఒక పెద్ద సినిమాకి పనిచేసే అవకాశాన్ని కొట్టేసాడు. అక్కినేని వంశంలోని మూడు తరాల హీరోలు ఎ.ఎన్.ఆర్, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న ‘మనం’ సినిమాకి డైలాగ్స్ రాయనున్నానని హర్ష వర్ధన్ తెలిపాడు.

విక్రం కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శ్రియ శరన్, సమంత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకి రాయడం నాకొక పెద్ద భాద్యత, నా నుంచి బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని హర్షవర్ధన్ అన్నాడు. సమ్మర్ తర్వాత సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :