‘మెగా మేనల్లుడి’ సినిమా నుండి తప్పుకున్న ‘స్టార్ హీరో’ ?

Published on Jul 31, 2019 8:08 pm IST

హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడైన వైష్ణ‌వ్‌ తేజ్ నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘ఉప్పెన’ అనే సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వాస్తవిక ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం బెస్తవాళ్ల బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. ఇక ఇందులో ఓ కీలక రోల్ లో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించబోతున్న సంగతి తెలిసిందే.

అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్‌ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. కేవలం డేట్స్‌ కుదరకపోవడంతోనే విజయ్‌ సేతుపతి సినిమా నుండి తప్పుకుంటున్నారట. ఇప్పటివరకైతే ఈ వార్తకు సంబధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ చిత్రానికి ‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు. అలాగే ‘రంగస్థలం’ ఫేమ్ రామకృష్ణ మౌనిక ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను చూసుకుంటుండగా… నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :