ఎన్టీఆర్ సినిమాలో విలన్ అతనే !

ఎన్టీఆర్ సినిమాలో విలన్ అతనే !

Published on Mar 25, 2018 6:57 PM IST

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఏప్రిల్ రెండో వారం నుండి షూటింగ్ మొదలు కానుంది. తాజా సమాచారం మేరకు జగపతిబాబు ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న ఎన్టీఆర్ ఈ సినిమా కోసం తన లుక్ మార్చుకోవడం జరిగింది.

స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన త్రివిక్రమ్ ప్రస్తుతం నటీనటుల ఎంపిక చేస్తున్నాడు. ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమా కు సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో ఎన్టీఆర్, జగపతిబాబు నాన్నకు ప్రేమతో సినిమాలో నటించారు. ఆ మూవీ లో కూడా జగ్గు భాయ్ నెగిటివ్ పాత్రలో కనిపించాడు. పూజా హెగ్డే తో పాటు మరో హీరోయిన్ ఈ మూవీలో నటించే అవకాశాలు ఉన్నాయి.

తాజా వార్తలు