“RRR” లో ఆ సాంగ్ గుండెల్లో నిలిచిపోతుందట.!

“RRR” లో ఆ సాంగ్ గుండెల్లో నిలిచిపోతుందట.!

Published on Jul 20, 2021 4:00 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియన్ లెవెల్లో ఒక లెవెల్లో అంచనాలు పెంచుకుంటూ వెళ్తుంది. మరి ఈ చిత్రం నుంచి సాలిడ్ అప్డేట్స్ ని కూడా మేకర్స్ వదులుతూ వస్తున్నారు.

ఇటీవలే ఓ అదిరే మేకింగ్ వీడియోని వదిలిన మేకర్స్ మరో అప్డేట్ కూడా ఇవ్వనున్నట్టు కొన్ని రోజులు కితం హింట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఓ సాంగ్ మాత్రం కొన్నేళ్ల పాటు ప్రతి ఒక్కరి గుండెల్లోనూ నిలిచిపోతుంది అని చెప్తున్నారు.

ఈ చిత్రంలో ఓ అద్భుతమైన పాట పాడిన ప్రకృతి అనే లిటిల్ సింగర్ కి కీరవాణి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయగా ఆ పాట ఎలా ఉంటుందో “RRR” యూనిట్ తెలిపారు. అలాగే త్వరలోనే పాటలు కూడా వస్తాయని తెలుపుతున్నారు. మరి ఈ సాలిడ్ చిత్రం మ్యూజిక్ ఆల్బమ్ ఏ లెవెల్లో ఉంటుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు