విజయ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన హెబ్బా పటేల్ !
Published on May 14, 2017 9:58 am IST


ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న యంగ్ హీరోయిన్లలో హెబ్బా పటేల్ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. కొన్ని రోజుల క్రితమే ‘మిస్టర్’ సినిమాతో సందడి చేసిన ఈమె ప్రస్తుతం ‘అంధగాడు, ఏంజెల్’ సినిమాల విడుదలకు ఎదురుచూస్తూనే మరికొన్ని కొత్త సినిమాలకు సైన్ చేసే పనిలో ఉన్నారు. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈమె యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం విజయ్ నూతన దర్శకుడు రాహుల్ సంకృత్యాయన్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో కథ ప్రకరాం ఇద్దరు హీరోయిన్లు ఉండగా ముందుగా ప్రియాంకను హీరోయిన్ గా తీసుకుని మరొక హీరోయిన్ గా హెబ్బా పటేల్ ను అనుకుని ఆమెను సంప్రదించారట. హెబ్బా పటేల్ కూడా కథ వినగానే నచ్చి ఓకే చెప్పారని వినికిడి. అయితే ఈ ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

 
Like us on Facebook