‘హెబ్బా పటేల్’ మళ్లీ రెచ్చిపోతుందట !

Published on Mar 25, 2019 2:48 pm IST

సుకుమార్ నిర్మాణంలో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హెబ్బా పటేల్, ఆ సినిమా పుణ్యమా అని టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించి హీరోయిన్ గా బాగానే అవకాశాలు పట్టింది. కానీ ఆ తరువాత వరుస ప్లాప్ లతో ఈ అమ్ముడికి ప్రస్తుతం ఛాన్స్ లు తగ్గాయి. దాంతో వరుసగా బోల్డ్ సినిమాలు అంగీకరిస్తూ రెచ్చిపోతుంది. లాస్ట్ సినిమా ’24 కిస్సెస్’లో తన బోల్డ్ యాక్టింగ్ తో హెబ్బా ఆకట్టుకున్నప్పటికీ ఆ సినిమా విజయం సాధించలేకపోయింది.

అయితే తాజాగా హెబ్బా మరో బోల్డ్ మూవీలో మరో బోల్డ్ క్యారెక్టర్‌ ను అంగీకరించింది. సుశాంత్‌ రెడ్డి అనే దర్శకుడు దర్శకత్వంలో ప్రిన్స్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘రాడికల్‌’ చిత్రంలో హెబ్బా నటిస్తోందని.. ఈ సినిమాలో హాట్ హాట్ సీన్స్ తో మరింతగా రెచ్చిపోనుందని తేలుస్తోంది. ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ లో త్వరలోనే షూట్ కు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :