ఛాన్నాళ్ల తర్వాత హెబ్బాకు సినిమా దొరికింది

Published on Jul 14, 2019 3:15 pm IST

‘కుమారి 21 ఎఫ్’ చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయిన హీరోయిన్ హెబ్బా పటేల్ ఆ తరవాత వరుస పేటి సినిమాలు చేసింది. 2016లో మూడు చిత్రాలు, 2017లో మరో మూడు చిత్రాలు ఇలా వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేసిన ఆమెకు 2018లో ఉన్నట్టుండి బ్రేకులు పడ్డాయి. 2018లో కేవలం ’24 కిసెస్’ అనే సినిమాతో సరిపెట్టుకుంది.

అది కూడా ఫ్లాప్ కావడంతో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అప్పటి నుండి మంచి బ్రేక్ ఇచ్చే సినిమా చేయాలని పట్టుబట్టి కొన్ని అవకాశాలను వదులుకున్న ఆమెకు ఇన్నాళ్లకు మంచి ఛాన్స్ దొరికింది. నితిన్, వెంకీ కుడుముల కలయికలో రూపొందుతున్న ‘భీష్మ’ చిత్రంలో ఒక కీ రోల్ కోసం హెబ్బాను తీసుకున్నారట. ఆమె పాత్ర బలంగా ఉంటుందని టాక్. ఈ చిత్రంతోనైనా ఆశించిన బ్రేక్
ఆమెకు దక్కుతుందేమో చూడాలి. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న ప్రధాన కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More