‘హలో గురు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు !

‘హలో గురు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు !

Published on Oct 9, 2018 10:19 AM IST

Hello guru prema kosame
రామ్, అనుపమా జంటగా ‘నేను లోకల్’ ఫేమ్ త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 13న వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. అలాగే ఈచిత్రం యొక్క ట్రైలర్ ను అక్టోబర్ 10న విడుదల చేయనున్నారు. రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రం దసరా కానుకగా అక్టోబర్ 18న విడుదలకానుంది. ప్రముఖ హీరోయిన్ ప్రణీత ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది. ఇక ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రం తరువాత రామ్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటిస్తున్న ఈచిత్రంఫై మంచి అంచనాలే నెలకొన్నాయి.

తాజా వార్తలు