‘హలో గురు..’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముస్తాబవుతుంది !

Published on Oct 11, 2018 9:00 pm IST

రామ్ హీరోగా, దర్శకుడు నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ఇటివలే విడుదల అయినా ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. కాగా ఈ చిత్ర ఆడియో కూడా డైరెక్ట్ గా మార్కెట్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రధానంగా యూత్ ని టార్గెట్ చేసుకొని వస్తోన్న ఈ చిత్రం. యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలతోనే తెరకేక్కించారట. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 13న గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

కాగా మంచి లవ్ సబ్జెక్ట్ తో ఎంటర్ టైనర్ గా సాగనున్న ఈ చిత్రంలో రామ్ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రణీత సుభాష్ మరో హీరోయిన్ గా కనిపించనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 18 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :