ఓటీటీలో “అనిమల్” రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్.!

ఓటీటీలో “అనిమల్” రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Dec 2, 2023 7:02 AM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన సాలీడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా “అనిమల్”. మరి హిందీ సహా తెలుగు లో కూడా సాలీడ్ రెస్పాన్స్ ని అందుకుంటున్న ఈ చిత్రం విషయంలో ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి తెలుస్తోంది.

ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ గా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లాక్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇందులో ఈ సినిమా ఎప్పటి నుంచి వస్తుందో తెలుస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా జనవరి 26 నుంచి అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా సమాచారం. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి టి సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ వారు నిర్మాణం వహించగా బాబీ డియోల్ విలన్ గా నటించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు