పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన భీష్మ

Published on Feb 17, 2020 6:36 pm IST

దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరో నితిన్, రష్మిక మందాన హీరో హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం భీష్మ. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 21న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నేడు భీష్మ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా గల ఈ చిత్ర ట్రైలర్ సరికొత్తగా ఉంది.

భీష్మలో నితిన్ రష్మిక ల రొమాంటిక్ ట్రాక్ తో పాటు, సోషల్ మెస్సేజ్ కూడా ఉందని అర్థం అవుతుంది. లాభాపేక్షలతో కృత్రిమ ఎరువులు, రసాయనాలు వాడి హెబ్రీడ్ పంటలు పండించడం వలన ప్రజారోగ్యానికి ఎంత హాని జరుగుతుంది అనేది చెప్పినట్లు ఉన్నారు. ఇక అశ్వథామ చిత్రంలోసైకో డాక్టర్ గా చేసిన జిష్షు సేన్ గుప్త భీష్మలో ప్రధాన విలన్ పాత్ర చేశారు. మొత్తానికి భీష్మ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా, మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More