ఖైదీ న్యాయపోరాటం…ఆసక్తిరేపుతున్న నాంది టీజర్.

Published on Jun 30, 2020 10:49 am IST

అల్లరి నరేష్ పుట్టినరోజు సంధర్భంగా నేడు ఆయన లేటెస్ట్ మూవీ నాంది టీజర్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఈ మూవీపై ఆసక్తిరేపిన అల్లరి నరేష్, టీజర్ తో దానిని మరో స్థాయికి తీసుకెళ్లారు. కామెడీ హీరోగా ఇమేజ్ ఉన్న అల్లరి నరేష్ ఓ సీరియస్ సబ్జెక్టు ఈ చిత్రం ద్వారా డిస్కస్ చేయనున్నాడు అనిపిస్తుంది. కారణం ఏదైనా శిక్షపడిన ఖైదీగా అల్లరి నరేష్ కనిపిస్తుండగా, ఆయన్ని పోలీసులు చిత్ర హింసలకు గురిచేయడం టీజర్ లో చూపించారు. న్యాయ పోరాటం చేసే ఖైదీగా ఆయన పాత్ర ఉంటుంది అనిపిస్తుంది.

ఇక ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ లాయర్ రోల్ చేస్తున్నారు. ఆమెను కూడా ఈ టీజర్ లో పరిచయం చేశారు. నటుడు ప్రవీణ్, ప్రియదర్శి కూడా ప్రాధాన్యం ఉన్న రోల్స్ చేసినట్లున్నారు. దర్శకుడు కనకమేడల విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. సతీష్ వేగేశ్న నిర్మించారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More