రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ లో ఎన్ని ఆసక్తికర సంగతులో..!

Published on Jul 10, 2020 10:31 am IST

ప్రభాస్ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ అప్డేట్ వచ్చేసింది. ఆయన 20వ చిత్రానికిరాధే శ్యామ్ అనే క్లాసిక్ టైటిల్ నిర్ధారించారు. ఈ టైటిల్ కొద్దిరోజులుగా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుండగా దర్శక నిర్మాతలు దానినే ఫైనల్ చేయడం గమనార్షం. ఇక రాధే శ్యామ్ పోస్టర్ లో ప్రభాస్ తో పాటు, హీరోయిన్ పూజా హెగ్డే ను కూడా పరిచయం చేశారు. సూట్ లో జెంటిల్ మెన్ లుక్ లో ఉన్న ప్రభాస్ రెడ్ గౌన్ లో రిచ్ గా పూజా హెగ్డేతో ఓ రొమాంటిక్ పోజిచ్చారు. ఇక పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో ఇటలీ దేశంలోని ప్రధాన పర్యాటక ప్రదేశం అయినా కల్లోజియం కనిపిస్తుంది.

ప్రభాస్, పూజ హెగ్డే గెటప్స్ చూస్తుంటే ఇటలీ దేశంలో 1960ల కాలానికి చెందిన ఓ హై క్లాస్ సొసైటీ కి చెందిన ప్రేమ జంటగా కనిపిస్తున్నారు. అలాగే పోస్టర్ లో రోమ్ నగరాన్ని ఓ విపత్తు ముంచెత్తున్నట్లు గా కుండా ఉంది. ఏదిఏమైనా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన దర్శకుడు ఆసక్తి రేపాడు. ఇక ఈ మూవీ 2021లో విడుదల చేస్తున్నట్లుగా కూడా చెప్పడం గమనార్హం.

సంబంధిత సమాచారం :

More