సుధీర్ తో దమ్ముంటే నన్నాపు..అంటున్న నాని

Published on Feb 17, 2020 5:04 pm IST

నాని హీరోగా దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘వి’. నాని గత చిత్రాలతో పోల్చుకుంటే వి మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. వీరిద్దరిది హిట్ కాంబినేషన్ కావడంతో పాటు, నాని ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉండే సీరియల్ కిల్లర్ రోల్ చేస్తున్నాడు. మరో హీరో సుధీర్ వి మూవీలో పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. వి మూవీపై ఎంతో ఆసక్తి నెలకొని ఉండగా నేడు ఈ చిత్ర టీజర్ నేడు విడుదలైంది. అంచనాలకు తగ్గట్టుగా వి టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

పోలీస్ కి ప్రొఫెషన్ కిల్లర్ కి మధ్య నడిచే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఆధారాలు కూడా దొరక్కుండా మర్డర్స్ చేసే కిల్లర్ ని వేటాడే రఫ్ పోలీస్ అధికారిగా సుధీర్ కనిపిస్తున్నారు. ఇక నాని బాడీ లాంగ్వేజ్, మరి డైలాగ్ డెలివరీ చాలా కొత్తగా ఉన్నాయి. భారీ బడ్జెట్ తో వి చిత్రం తెరకెక్కించినట్లున్నారు. ఖచ్చితంగా వి మూవీ ఓ రేంజ్ లో ఉంటుందనిపిస్తుంది. టీజర్ తరువాత ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రంలో నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More