పునర్నవిపై పుకార్లకు చెక్ పడిందా.?

Published on Oct 30, 2020 3:00 pm IST

అంతకు ముందు పలు సినిమాల్లో కనిపించినా రాని గుర్తింపు మన తెలుగు స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి “బిగ్ బాస్ సీజన్ 3” తో పునర్నవి భూపాలం దక్కించుకుంది. ముఖ్యంగా ప్రముఖ సింగర్ మరియు బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో బిగ్ బాస్ హౌస్ లో కుదిరిన కెమిస్ట్రీ ఆ మధ్య అంతా అబ్బో ఓ రేంజ్ లో రచ్చ లేపింది.

దీనితో ఈ ఇద్దరి జంట కూడా స్మాల్ స్క్రీన్ పై ఒక ట్రెండ్ ను సెట్ చేసుకుంది. సరే అక్కడ నుంచి ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యిపోయారు కానీ ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి పేర్లు హాట్ టాపిక్ గా వినిపిస్తున్నాయి. అప్పుడు రాహుల్ – నవి లకు ఉన్న కెమిస్ట్రీ చూసి పెళ్లి వరకు వెళ్తారని చాలా మంది ఫిక్సయ్యిపోయారు.

కానీ లేటెస్ట్ గా పునర్నవి తనకు ఎంగేజ్ మెంట్ అయ్యినట్టుగా పెట్టిన ఓ ఫోటో రకరకాల స్పెక్యులేషన్స్ రేపి నానా రభసకు దారి తీసింది. రాహుల్ ను పునర్నవి చీట్ చేసిందని ఏవేవో పుకార్లు వినిపించాయి. కానీ అసలు విషయంలోకి వెళ్తే మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ అయినటువంటి “ఆహా” లో ప్లాన్ చేసిన ఒక లవ్ బేస్డ్ వెబ్ సిరీస్ కు ప్రమోషన్స్ లో భాగంగా ప్లాన్ చేసిందే అట. అంతకు మించి ఇందులో ఇంకేమి లేదని కన్ఫామ్ అయ్యినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More