టీజర్ తో అదరగొడుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ !

Published on Nov 22, 2019 5:14 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా టీజర్ కోసం అభిమానులతో పాటు యావత్తు ప్రేక్షక లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది. కాగా వారి ఆసక్తికి ఏ మాత్రం తీసిపోకుండా టీజర్ పవర్ ఫుల్ గా వచ్చేసింది. మహేష్ బాబు లుక్ అండ్ గెటప్, అనిల్ రావిపూడి టేకింగ్ అండ్ టైమింగ్ టీజర్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘మీరు ఎవరో మాకు తెలియదు; అంటూ మొదలైన టీజర్ లో సైనికుల గొప్పదనాన్ని.. అలాగే మహేష్ బాబు పాత్రతో పాటు విజయశాంతి పాత్రను కూడా బాగా ఎలివేట్ చేశారు. ఇక చివర్లో ప్రకాష్ రాజ్ డైలాగ్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. వీటికి తోడు బ్యూటిఫుల్ విజువల్స్ తో టీజర్ సినిమా పై అంచనాలను ఇంకా పెంచేసింది. మొత్తానికి ఈ టీజర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

కాగా ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More