నానితో `మ‌న్మ‌థుడు 2` డైరెక్టర్ ?

Published on Aug 25, 2019 10:29 am IST

తన మొదటి సినిమా ‘చి.ల.సౌ’తోనే మంచి హిట్ అందుకున్నాడు రాహుల్ ర‌వీంద్ర‌న్. తన రెండో చిత్రంగా కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా `మ‌న్మ‌థుడు 2`ను తెరకెక్కించాడు. రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ గా వచ్చిన ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది. అయితే ఈ చిత్రం ఫలితంతో సంబంధం లేకుండా రాహుల్ తన తదుపరి మూడో సినిమాని కూడా త్వరలో మొదలెట్టానున్నాడు. ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తోన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే ఉంటుందేమో చూడాలి.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో భాగమైన ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్స్‌ లో రాహుల్‌ – నాని కాంబినేషన్‌ లో సినిమా ఉంటుందట. అయితే ఈ చిత్రం యొక్క పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ ర‌వీంద్ర‌న్ ప్రస్తుతం డైరెక్టర్ గా బిజీ అవుతుండటం విశేషం.

సంబంధిత సమాచారం :

X