యాక్షన్ హీరోకు షూటింగ్ లో స్వల్ప గాయాలు !

Published on Feb 18, 2019 1:17 pm IST

యాక్షన్ హీరో గోపీచంద్.. ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ చిత్రం జైపూర్ దగ్గర మాండవలో చిత్రీకరణ జరుపుకుంటొంది. ఈ రోజుతో అక్కడ షూటింగ్ ముగించుకోనుంది, కానీ ఇంతలో హీరో గొపిచంద్ పై బైక్ చేజింగ్ పోరాట సన్నవేశాలు చిత్రీకరణ చెస్తున్న సమయంలో బైక్ స్కిడ్ అవ్వటంతో గోపీచంద్ కి స్వల్ప గాయాలయ్యాయి‌.

కాగా ప్రస్తుతం గోపిచంద్ ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని, గాయాలకు ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరం మిగిలిన చిత్రీకరణ చెసుకోవచ్చని అక్కడి ఫోర్టీస్ హాస్పిటల్స్ డాక్టర్స్ తెలిపారు. ఇక ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ 18 గా అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా మే లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకి సాంకేతిక నిపుణులు : కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం : తిరు, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి, రచయిత: అబ్బూరి రవి.

సంబంధిత సమాచారం :