ఇంటర్వ్యూ : హీరో కార్తికేయ – ‘గుణ 369’ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి కథ !

ఇంటర్వ్యూ : హీరో కార్తికేయ – ‘గుణ 369’ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి కథ !

Published on Jul 31, 2019 5:19 PM IST

 

అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఆర్‌.ఎక్స్.100 ఫేమ్ కార్తికేయ హీరోగా, మ‌ల‌యాళ భామ‌ అన‌ఘ హీరోయిన్ గా తెర‌కెక్కిన చిత్రం ‘గుణ 369’. శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల స‌మ‌ర్ప‌ణ‌లో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. కాగా ఈ సినిమా ఆగష్టు 2న రిలీజ్ అవుతోన్న సంద‌ర్భంగా ఈ చిత్ర హీరో కార్తికేయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా గురించి హీరో కార్తికేయ వెల్లడించిన ఆసక్తికర విశేషాలు మీ కోసం…

 

‘హిప్పీ’కి మీరు ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాలేదు. ఎలా అనిపించింది ?

 

‘హిప్పీ’కి బాగా కష్టపడ్డాం. కానీ రిజల్ట్ ఆశించిన స్థాయిలో రాలేదు. ఆ సినిమాలోని కంటెంట్ ను నమ్మి ఆ సినిమా చేశాం. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ చిత్రాన్ని మొత్తానికి ప్రేక్షకులు ఆదరించలేదు. కానీ ఆ సినిమాని కూడా ‘ఆర్ ఎక్స్ 100’లాగే చాల జాగ్రత్తలు తీసుకుని చేశాము.

 

ఈ సినిమాకి ‘గుణ 369’ అని టైటిల్ పెట్టడానికి కారణం ?

 

‘గుణ’ టైటిల్ బాగా నచ్చింది. అయితే ‘గుణ’ అని ఆల్ రెడీ కమల్ హాసన్ గారి సినిమా ఉంది. అందుకే గుణ పక్కన 369 అనే నెంబర్ ను యాడ్ చేశాము. 369 అనే సౌండ్ నాకు చాల పవర్ ఫుల్ గా అనిపించింది. అందుకే ఆ టైటిల్ నే పెట్టాము.

 

ఈ సినిమాలో మీకు బాగా కనెక్ట్ అయిన అంశం ఏమిటి ?

 

సినిమా కథే నండి. ఇది రెగ్యులర్‌ కమర్షియల్‌ స్టోరీ కాదు, ఒంగోలు ప్రాంతానికి చెందిన ఓ మిడిల్ క్లాస్ కుర్రాడికి సంబంధించిన వాస్తవ కథను ఆధారం చేసుకొని ఇది రాసింది. నా మనసుకు బాగా నచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో మంచి థీమ్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది.

 

డైరెక్టర్ అర్జున్ జంధ్యాల గురించి చెప్పండి ?

 

అర్జున్ జంధ్యాల క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఆయన స్క్రిప్ట్ ను కూడా ఏదో కామెడీ ఉండాలి అని, లేక ఇక్కడ సాంగ్స్ ఉంటే బాగుంటుందనే ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా కథను రాస్తారు. పైగా ఆయన ఆలోచనలు నా ఆలోచనలు చాల దగ్గరగా ఉంటాయి. ఆయన నాకు బాగా నచ్చని వ్యక్తి కూడా.

 

సినిమాలో మీ సరసన నటించిన హీరోయిన్ అన‌ఘ గురించి ?

 

కథానుసారం ఈ సినిమాలో హీరోయిన్ రోల్ ఓ సెల్ షాప్ లో పని చేస్తోంది. ఒక విధంగా గ్లామర్ లేని రోల్. అన‌ఘ ఆ రోల్ లో చాల బాగా నటించింది.

 

ఓ పక్క హీరోగా రాణిస్తున్నారు. సడెన్ గా ఎందుకు ‘గ్యాంగ్ లీడర్’లో విలన్ గా నటిస్తున్నారు ?

 

లేదండి. నా రోల్ గురించి నేను ఏమి చెప్పలేదు కదా విలనా లేక ఇంకోటా అని… ఒక్కటైతే నిజం ఆ సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినందుకు చాల హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంత పెద్ద సినిమాలో నేను కూడా పార్ట్ అవ్వడం నిజంగా లక్కీయే కదా. ఎందుకంటే నాది ఒక స్పెషల్ క్యారెక్టర్. పైగా ఆ సినిమాలో నా రోల్ కూడా చాలా కొత్తగా ఉంటుంది.

 

అల్లు అరవింద్ గారు ఓ ఫంక్షన్ లో వెల్ కమ్ టు గీత ఆర్ట్స్ అన్నారు. మీతో సినిమా ప్లాన్ చేస్తున్నారా ?

 

అదేం లేదండి. నేను ఆయనతో సరదాగా గీత ఆర్ట్స్ లో మాకు ఛాన్స్ ఉంటుందా అని అడిగితే.. ఆ మాటకి అయన సరదగా వెల్ కమ్ టు గీత ఆర్ట్స్ అన్నారు. సినిమా ప్లానింగ్ అయితే ఏమి లేదు. ఉంటే బాగుండు.

 

మీ తదుపరి సినిమాలు ఏమిటి ?

 

గ్యాంగ్ లీడర్ ఒకటి చేస్తున్నాను, అలాగే శ్రీ అనే నూతన డైరెక్టర్ స్క్రిప్ట్ ఓకే చేశాను. అలాగే ఓ కొత్త టైపు సినిమా ఒకటి చేస్తున్నాను. కొత్తగా ఉన్నా ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటుంది ఆ సినిమా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు