తెలంగాణ అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్ట్ మీట్ లో మంచు మనోజ్.!

Published on Aug 8, 2021 10:27 am IST


చాలా కాలం అనంతరం గ్యాప్ తీసుకుని మంచు వారై మోస్ట్ లవబుల్ యంగ్ హీరో మంచు మనోజ్ మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మనోజ్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఓ కీలక భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే రాష్ట్ర మంత్రులు శ్రీ V. శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి గార్లు వికారాబాద్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అనంతగిరి హిల్స్ లో ప్రతిపాదిత అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్ట్ అభివృద్ధి పై చర్చించారు.

మరి ఈ మీట్ లో ప్రముఖ నటుడు శ్రీ మంచు మనోజ్ కుమార్ అడ్వెంచర్స్ టూరిజం, వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు పై రూపొందించిన పలు ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. అనంతగిరి లో ఏర్పాటు చేయబోతున్న అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్టు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని టూరిజం అధికారులను ఆదేశించారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రాజెక్టు రిపోర్ట్ ను తయారు చేయాలని మంత్రులు టూరిజం MD మనోహర్ గారిని ఆదేశించారు.

అలాగే అనంతగిరి హిల్స్ లో ఏర్పాటు చేయబోతున్న ప్రతిపాదిత అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్టు ఏర్పాటు కు సుమారు 150 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారన్నారు మంత్రులు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా 500 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. ఇలాంటి కీలక భేటీలో మనోజ్ చర్చించి తన వ్యూ ని వ్యక్తపరచడం విశేషం. మరి ప్రస్తుతం మనోజ్ అహం బ్రహ్మాస్మి అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :