అనుకున్న డేట్ కే ‘మోసగాళ్లు’ వస్తారా ?

Published on Mar 29, 2020 9:30 pm IST

మంచు విష్ణు హీరోగా వస్తోన్న ‘మోసగాళ్లు’ సినిమా రిలీజ్ డేట్ ను విష్ణు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. జూన్ 5న ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే కరోనా దెబ్బకు సినిమాలన్నీ పోస్ట్ ఫోన్ అయ్యాయి. సో.. మరి ముందు అనుకున్న మిగిలిన సినిమాలు అన్ని జూన్ లో వచ్చే అవకాశం ఉంది. మరి వాటితో పాటే ‘మోసగాళ్లు’ కూడా రిలీజ్ అవుతుందా ? లేక పోస్ట్ ఫోన్ అవుతుందా అనేది చూడాలి.

కాగా ఈ మూవీలో విష్ణుతో పాటు అందాల తార కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి మరో రెండు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. సినిమాలో విష్ణు పోషిస్తున్న క్యారెక్టర్ చాలా ఇన్టెన్స్ గా ఉంటుందట. టెర్రిఫిక్ స్టోరీ, క్యారెక్టరైజేషన్, యాక్షన్ మేళవిపుంతో తయారవుతున్న ‘మోసగాళ్లు’ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టితో పాటు నవదీప్, నవీన్ చంద్ర వంటి పేరుపొందిన యాక్టర్లు కూడా నటిస్తోన్నారు.

సంబంధిత సమాచారం :

X
More