ఆహా లో విడుదల కి సిద్దం గా ఉన్న హీరో… ట్రైలర్ విడుదల!

Published on Jul 21, 2021 11:07 pm IST

భరత్ రాజ్ దర్శకత్వం లో రిశబ్ శెట్టి, గనవి లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హీరో. ఈ చిత్రం తెలుగు లో ఆహా వీడియో ద్వారా విడుదల కానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్రైలర్ నేడు విడుదల అయింది. వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా జూలై 24 వ తేదీన ఈ చిత్రం ఆహా లో స్ట్రీమ్ కానుంది. అయితే ప్రేమ కోసం ఒక యువకుడు ఎంత వరకు వెళ్తాడు, ఏం చేస్తాడు అనే కథాంశం తో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :