ఓటీటీ అంటే వద్దంటున్న నాని.. ఎందుకంటే?

Published on Jul 21, 2021 2:41 am IST

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. టక్ జగదీష్‌తో పాటు అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయ్ సినిమాల షూటింగ్‌లలో పాల్గొంటున్నాడు. అయితే నాని తన సినిమాల పరంగా ఓ విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తుంది. తాను హీరోగా చేస్తున్న ఏ సినిమాను కూడా ఓటీటీలకు ఇవ్వకూడదని అనుకుంటున్నాడట.

అయితే గత ఏడాది నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన “v” సినిమా 2020 సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా వ్యూస్ పరంగా ఓకే అనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో నాని ఓటీటీ అంటేనే భయపడుతున్నట్టు కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే టక్ జగదీష్ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని ముందుగా నిర్మాతలు ఆలోచన చేయగా, దానికి నాని వద్దని తెగేసి చెప్పినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :