థియేటర్లో సినిమా చూడటం మన సంస్కృతి – నాని

థియేటర్లో సినిమా చూడటం మన సంస్కృతి – నాని

Published on Jul 28, 2021 2:30 AM IST

సత్యదేవ్, ప్రియాంకా జవాల్కర్‌ జంటగా శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం “తిమ్మరుసు”. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ఒరిజినల్స్‌ బ్యానర్‌పై సృజన్ ఎరబోలు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జూలై 30వ తేదిన థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక జరగ్గా నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ సత్యదేవ్‌ అంటే నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా తనకు చాలా ఇష్టమని, ఈ సినిమాతో తనకు మంచి స్టార్‌డమ్‌ రావడం ఖాయమని అన్నారు. మన దేశంలో సినిమాకి మించిన వినోదం లేదని, థియేటర్లో సినిమా చూడటం మన సంస్కృతి అని అన్నారు. థియేటర్‌ ఇండస్ట్రీపై ఆధారపడి బతికేవారు లక్షల మంది ఉన్నారని, థియేటర్ల మూతబడడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడి థియేటర్లు తెరుచుకుంటున్నాయని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ థియేటర్లలో సినిమాలను ఆస్వాదిద్దామని, థర్డ్‌వేవ్‌లాంటివి రాకుండా ఉండాలని ఆశిద్దామని ‘తిమ్మరుసు’ చిత్రం తర్వాత ‘టక్‌ జగదీశ్, లవ్‌స్టోరీ, ఆచార్య, రాధేశ్యామ్, ఆర్‌ఆర్‌ఆర్‌ ఇలా అన్ని సినిమాలను థియేటర్లలోనే చూడాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. ‘తిమ్మరుసు’ మంచి హిట్‌ సంపాదించుకుని ఈ నెల 30 నుంచి విడుదలయ్యే సినిమాలకు ఆక్సిజన్‌ ఇవ్వాలని నాని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు