విక్రమ్ కుమార్ సినిమాలో నానికి జోడిగా.. !

Published on Jan 18, 2019 9:37 am IST

‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని తన 24వ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే.ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాలో నాని సరసన నటించబోయే హీరోయిన్ ఎవరా అని నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ కీర్తి సురేష్ డేట్లు ఎడ్జెస్ట్ కాకపొతే.. కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో దర్శకనిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ఫిబ్రవరి మూడో వారం నుండి మొదలుకానుంది. అయితే ఈ చిత్రం పూర్తి థ్రిల్లర్ గా ఉండబోతుందని, అలాగే ఆడవారికి సంబందించిన మంచి సోషల్ మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉంటుందట.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కెమెరామేన్ పి సి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. తర్వలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలను చిత్రబృందం అధికారికంగా ప్రకటించనుంది.

సంబంధిత సమాచారం :

X
More