పవన్ మూవీ విడుదలపై క్లారిటీ ఇచ్చిన నితిన్.

Published on Feb 18, 2020 12:07 pm IST

పవన్ కళ్యాణ్ వీరాభిమాని నితిన్ పవన్ కళ్యాణ్ మూవీ విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు. పవన్ సినిమా విడుదల తేదీ భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షిగా హింట్ ఇచ్చారు. నితిన్ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మూవీ మేలో విడుదల కానుందని, వీరాభిమానులుగా మనం చొక్కాలు చించుకోవడానికి, ఈలలు వేసి గోల చేయడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా వస్తున్న పింక్ రీమేక్ మే నెలలో విడుదల కానుందంటూ వార్తలు వస్తున్నప్పటికీ స్పష్టత లేదు. నిన్న దీనిపై హీరో నితిన్ క్లారిటీ ఇచ్చారు.

నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక పవన్ మరో చిత్రం దర్శకుడు క్రిష్ తో చేస్తున్నారు. ఈ మూవీ కూడా చిత్రీకరణ జరుపుకుంటుంది. క్రిష్ ఈ మూవీని పీరియాడిక్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ తో ప్రకటించిన మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

సంబంధిత సమాచారం :