మ్యూజిక్ మొదలైంది.. మీ ఆశీర్వాదం కావాలి – నితిన్

Published on Feb 16, 2020 3:00 am IST

హీరో నితిన్ పెళ్లికి రెడీ అయిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన షాలిని కందుకూరి అనే అమ్మాయిని పెళ్లాడనున్నాడు నితిన్. కొన్నేళ్ళుగా ప్రేమలో ఉన్న నితిన్, షాలినిలు పెద్దలు పెళ్లికి ఒప్పుకోవడంతో ఏప్రిల్ 16న వివాహం జరగనుంది. అది కూడా దుబాయ్ లో కావడం విశేషం. పెళ్లి ఎలాగూ విదేశాల్లోనే కావడంతో నిశ్చితార్థం హైదరాబాద్లోని తన నివాసంలో ఈ రోజు ఘనంగా చేసుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సన్నిహితులు, పెద్దలు హాజరయ్యారు.

కాగా ఈ ‘పసుపు కుంకుమ’ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసిన్ నితిన్ “పెళ్లిపనులు మొదలయ్యాయి. మ్యూజిక్ మొదలైంది. మీ ఆశీర్వాదం కావాలి” అని పోస్ట్ చేశాడు. ఇకపోతే నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 21న విడుదలకానుంది. ఇది పూర్తికాగానే వెంకీ అట్లూరి డైరెక్షన్లో ‘రంగ్ దే’ చిత్రం స్టార్ట్ చేయనున్నారు. ఇది కాకుండా కృష్ణ చైతన్య దర్శకత్వంళో ఒక సినిమా చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు నితిన్.

సంబంధిత సమాచారం :

X
More