అంధాదున్ రీమేక్ కోసం వెయిట్ తగ్గిన హీరో

Published on Feb 14, 2020 3:04 pm IST

2018లో హిందీలో విడుదలై మంచి విజయం అందుకున్న చిత్రం అంధాదున్. యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా,టబు, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలలో క్రైమ్ డ్రామా వచ్చిన ఈ చిత్రం హీరో ఆయుష్మాన్ కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తెచ్చిపెట్టింది. కాగా ఈ చిత్రం తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ కానుంది. అలాగే తమిళంలో ఈ చిత్రాన్ని హీరో ప్రశాంత్ రీమేక్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం కోసం ఆయన చాలా వెయిట్ తగ్గారట. జిమ్ లో కఠిన కసరత్తులు చేసి ఆయన ఫిట్ గా తయారయ్యారట.

ఇక హీరో ప్రశాంత్ తండ్రి గారైన నటుడు మరియు నిర్మాత త్యాగరాజన్ ,అంధాదున్ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. ఆయనే నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. బేసిక్ గా ప్రొఫెషనల్ పియానో ప్లేయర్ అయిన ప్రశాంత్ ఈ చిత్రంలో మరింత ఫైన్ యాక్టింగ్ కనబరచడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకప్పుడు తమిళ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న ప్రశాంత్ వరుస పరాజయాలతో రేస్ లో వెనుకబడిపోయారు.

సంబంధిత సమాచారం :

X
More