రోడ్డు ప్రమాదానికి గురైన హీరో రాజశేఖర్…!

Published on Nov 13, 2019 9:34 am IST

సీనియర్ హీరో రాజశేఖర్ కారు గత రాత్రి ప్రమాదానికి గురైంది. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ని ఢీకొన్న కారు గాలిలో పల్టీలు కొట్టి దూరంగా పడినట్టు తెలుస్తుంది. ఐతే రాజశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడినట్టు ప్రాథమిక సమాచారం. దీనితో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన ప్రమాద సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకొని ఉండటం వలన పెను ప్రమాదం తప్పింది. సంఘటన అనంతరం ఘటనా ప్రదేశం నుండి వేరే కారులో ఆయన ఇంటికి చేరుకున్నారు.

రామోజీ ఫిలిం సిటీ నుండి ఇంటికి వస్తుండగా హైదరాబాద్ నగర శివారులోని గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ పై సడన్ గా కార్ టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో రాజశేఖర్ ఒక్కరే కారులో ఉన్నారు. రాజశేఖర్ ఇటీవల కల్కి అనే చిత్రంలో పోలీస్ అధికారిగా నటించారు.

సంబంధిత సమాచారం :

X
More