‘డిస్కోరాజా’లో హాట్ బ్యూటీ సాంగ్ హైలెట్ అట !

Published on Aug 1, 2019 9:27 pm IST

టాలెంటెడ్ డైరెక్టర్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రాబోతున్న చిత్రం “డిస్కోరాజా”. కాగా ఈ సినిమాలో ర‌వితేజ సరసన హీరోయిన్స్ గా పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్‌ ముగ్గురు నటిస్తున్నారు. కాగా ఇటీవలే తాన్యా హోప్‌ ఈ సినిమాకి సంబంధించిన షూట్ లో పాల్గొంది. సినిమాలో తాన్యా హోప్‌ రోల్ కాస్త బోల్డ్ గా ఉంటుందట. ముఖ్యంగా ఆమె పై వచ్చే ఓ మసాలా సాంగ్ సినిమాలోనే హైలెట్ గా నిలవబోతుందని తెలుస్తోంది.

కాగా గ్లామ‌ర్ పరంగా తాన్యా హోప్ కి తిరుగులేకపోయినా.. ఆమెకు పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. కనీసం ‘డిస్కోరాజా’తోనైనా తాన్యా హోప్ కి కాలం కలిసి వస్తోందేమో చూడాలి. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత‌ రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :