ఇన్‌స్పెక్టర్‌ గా ఎంతో థ్రిల్లింగ్‌ గా ఉందట !

Published on Aug 1, 2019 7:13 pm IST

సినిమాల్లోకి రావాలని, గొప్పగా రాణించాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే వాటిని సాధించేది మాత్రం కొందరే… ఆ కొందరిలాగానే పట్టుదలగా ఆ కలలను నిజం చేసుకున్నారు హీరో రూపేష్‌ కుమార్‌ చౌదరి. తనకెంతో ఇష్టమైన పోలీస్‌ ఆఫీసర్‌గా తొలి సినిమాలో నటిస్తున్నారు. తన ఆరాధ్య నటుడు విక్టరీ వెంకటేశ్‌ క్లాప్‌ తోనే సినిమా ప్రారంభం కావడంతో మరింత ఉత్సాహనిచ్చిందని అంటున్నారు హీరో రూపేశ్‌ కుమార్‌ చౌదరి. ఈయన హీరోగా మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై శివకుమార్‌ బి. దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ’22’. సలోని మిశ్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగస్ట్‌ 2న ఈ చిత్రం హీరో రూపేష్‌ కుమార్‌ చౌదరి పుట్టినరోజు.

ఈ సందర్భంగా రూపేష్‌ కుమార్‌ చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. మాది బిజినెస్‌ ఫ్యామిలీ. నేను కూడా బిజినెస్‌ చూసుకునేవాడ్ని. కానీ యాక్టింగ్‌ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో కొన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ కుదరలేదు. ఆ ప్రాసెస్‌లో ఆనీ మాస్టర్‌ శివగారిని పరిచయం చేశారు. అలా ఇద్దరం కలిసి ఒక వెబ్‌ సిరీస్‌ చేశాం. ఆ వెబ్‌ సిరీస్‌ తర్వాత సినిమా కూడా చేయగలనన్న కాన్ఫిడెన్స్‌ రావడంతో డిస్కస్‌ చేసుకుని ఈ సినిమా స్టార్ట్‌ చేశాం. షూటింగ్ చాలా బాగా జరుగుతోంది. సినిమాలో నేను రుద్ర అనే ఇన్‌స్పెక్టర్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను. ఈ సినిమా కథ అంతా 22 మీదే రన్‌ అవుతుంది. చాలా ట్విస్ట్‌లు, టర్న్‌లు ఉంటాయి. అందుకే ఆ టైటిల్ పెట్టాం అని అన్నారు.

సంబంధిత సమాచారం :