రైతుగా చమటలు చిందిస్తున్న స్టార్ హీరో.

Published on Jul 14, 2020 8:06 pm IST

సల్మాన్ ఖాన్ కొంత కాలంగా తన ఫార్మ్ హౌస్ లో ఉంటున్నారు. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫార్మ్ హౌస్ సల్మాన్ ఇష్టమైన ప్రదేశాలలో ఒకటిగా ఉన్నది. లాక్ డౌన్ సమయం నుండి సల్మాన్ ఎక్కువగా ఇక్కడే గడుపుతున్నాడు. తన పెంపుడు జంతువుల సంరక్షణ, మరి గార్డెనింగ్ చూసుకుంటున్నారు. దానితో పాటు సల్మాన్ వ్యవసాయదారుడిగా మారిపోయాడు. పొలంలో పనిచేసి అలసిపోయిన సల్మాన్ బురద శరీరంతో కూర్చొని ఉన్న ఫోటో పంచుకున్నారు. అలాగే ఆయన ‘రైతులకు నా వందనం’ అని ఓ లైన్ పోస్ట్ చేయడం జరిగింది.

ఇక సల్మాన్ ప్రస్తుతం ప్రభు దేవా దర్శకత్వంలో రాధే అనే మూవీ చేస్తున్నారు. గత ఏడాది వీరిద్దరి దర్శకత్వంలో వచ్చిన దబంగ్ 3 ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అలాగే ఫర్హాద్ సామ్జి దర్సకత్వంలో కభీ ఈద్ కభీ దివాళి అనే మూవీలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More