ఇంటర్వ్యూ : సందీప్ మాధవ్ (సాండి) – ‘ఇంత గొప్ప వ్యక్తిని పోగొట్టుకున్నామా’ అనే భావన మనసును కదిలిస్తోంది.

Published on Nov 18, 2019 7:22 pm IST

జార్జిరెడ్డి… దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ఎందరో విద్యార్తులను కదిలించిన వ్యక్తి, అలాంటి ఆదర్శనీయమైన విద్యార్థి నేత జీవితం వెండితెర పై ఆవిష్కృతం కాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ‘దళం’ సినిమాతో విబిన్నమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. కాగా ‘‘వంగవీటి’’ఫేం సందీప్ మాధవ్ (సాండి) ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. . కాగా నవంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సంధర్భంగా సందీప్ మాధవ్ (సాండి) మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం.

 

‘వంగవీటి’ చిత్రం తరవాత ‘జార్జిరెడ్డి’లో నటించడానికి చాల గ్యాప్ తీసుకున్నారు ?

‘వంగవీటి…’ మూవీ తరవాత చాల అవకాశాలు వచ్చినా.. నాకు ఏ కథ కనెక్ట్ అవ్వలేదు. ఆ సమయంలో జీవన్ రెడ్డి ‘జార్జి రెడ్డి’గారి కథ చెప్పారు. కథ వినగానే నాకు చాల బాగా నచ్చింది. అందుకే వెంటనే ఈ సినిమా చేయాలనిపించింది.

 

జార్జిరెడ్డి నేపథ్యం పూర్తిగా 1960 – 70 కాలంలో నడుస్తోంది. అప్పటి పరిస్థుతులను పాత్రలను తెర పైన చూపించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?

చాల జాగ్రత్తలు తీసుకున్నాం. జార్జిరెడ్డిగారికి సంబంధించిన పుస్తకాలు, ఆయన గురించి తెలిసిన వ్యక్తులతో మాట్లాడి.. అలాగే ఆయనకు సంబంధించిన వీడియోలును అన్నిటినీ పరిశీలించాము. అదేవిధంగా అప్పటి పరిస్థుతులను వాళ్ళ పాత్రలను అర్ధం చేసుకుని ఈ సినిమా చేశాము.

 

మీరు జార్జిరెడ్డిలా మారడానికి ఏం చేశారు ?

జార్జిరెడ్డిగారి గురించి పూర్తిగా తెలుసుకునేంత ఫూటేజ్ దొరకలేదు. కేవలం ఆయనకు సంబంధించి చిన్న వీడియో అండ్ కొన్ని ఫోటోలు మాత్రమే దొరికాయి. వాటి ఆధారంగానే నేను జార్జిరెడ్డిగారిలా మారడానికి ప్రయత్నం చేశాను.

 

మొదటిసారి జార్జిరెడ్డిగారి జీవితం గురించి విన్నప్పుడు మీకేలా అనిపించింది ?

కథ విన్నప్పుడే ఎమోషనల్ అయ్యాను. విడుదల తరువాత సినిమా చూశాక అందరూ అలాగే ఎమోషనల్ అవుతారు. ‘ఇంత గొప్ప వ్యక్తిని పోగొట్టుకున్నామా…?’ అనే భావన మన మనసును కదిలిస్తోంది. జార్జిరెడ్డిగారి ‘ఇస్రో..’ లాంటి కంపెనీలో మంచి అవకాశం వచ్చినా ఆయన నమ్మిన సిద్దాంతం కోసం ఆ అవకాశాన్ని వదులుకున్నారు. మనసును కదిలించే అంశాలు ఆయన జీవితంలో చాలా ఉన్నాయి.

 

ఆ అంశాలన్నిటినీ ఈ సినిమాలో చూపిస్తున్నారా ?

ప్రధానపమైన అంశాలన్నిటినీ చాల క్షుణ్ణంగా చూపిస్తున్నాము. కొన్ని అంశాలు చాల గొప్పగా అనిపిస్తాయి.

 

అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా పై అంచనాలు బాగున్నాయి. వాటిని రీచ్ అవుతామనే నమ్మకం ఉందా ?

ఖచ్చితంగా. మంచి సినిమా చేశామనే పూర్తి నమ్మకం ఉంది. దానికి తగ్గట్లుగానే ట్రైలర్ కి సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా కూడా అదే స్థాయిలో రీచ్ అవుతుందనే నమ్మకం ఉంది.

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా చేయాలనుకున్నారు ?

పవన్ కళ్యాణ్ గారికి జార్జిరెడ్డి అంటే చాలా ఇష్టం అట. అలాగే జార్జిరెడ్డిగారి మీద సినిమా చేయాలని ఆయన అనుకున్నారట. అందుకే ఈ చిత్రంలోని ఓ పాటను పవన్ కళ్యాణ్ గారికి డెడికేట్ చేశాం.

సంబంధిత సమాచారం :