హీరో శర్వానంద్ ఆర్థిక సాయం

Published on Mar 29, 2020 3:03 pm IST

కరోనా వైరస్ ప్రభావం అంత త్వరగా తగ్గే సూచనలు కనిపించడం లేదు. రోజు రోజుకు దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ పోతుంది. దీని కారణంగా అన్ని పరిశ్రమలతో పాటు, చిత్ర పరిశ్రమ సైతం మూతపడింది. సినిమాల విడుదల, షూటింగ్స్ కి బంద్ ప్రకటించడంతో ఈ పరిశ్రమపై ఆధారపడిన అనేక మంది ఉపాధికోల్పోయారు. ముఖ్యంగా రోజువారి కూలీపై ఆధారపడి బ్రతికే అనేక మంది కూలీలు జీవనోపాధి కోల్పోయారు.

చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్స్ సహాయార్ధం పరిశ్రమకు చెందిన హీరోలందరూ ముందుకు వస్తున్నారు. తాజాగా హీరో శర్వానంద్ వీరికోసం 15లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. డైలీ వర్కర్స్ శ్రేయస్సు కోసం ఆ డబ్బులు ఉపయోగించాల్సిందిగా ఆయన కోరాడు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, మహేష్ వంటి స్టార్ హీరోలతో పాటు విశ్వక్ సేన్ వంటి యంగ్ హీరో సైతం ఆర్ధిక సాయం ప్రకటించడం జరిగింది.

సంబంధిత సమాచారం :