ఇంటర్వ్యూ: శివ కందుకూరి – రియల్ ఇన్సిడెంట్స్ తో సాగే ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది.

ఇంటర్వ్యూ: శివ కందుకూరి – రియల్ ఇన్సిడెంట్స్ తో సాగే ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది.

Published on Jan 28, 2020 2:04 PM IST

శివ కందుకూరి హీరోగా శేష్ సింధూ రావ్ దర్శకత్వంలో రానున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘చూసీ చూడంగానే’. ఇక యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం సమకురుస్తుండగా.. రాజ్ కందుకూరి ఈ సినిమాని నిర్మించారు. ఈ సంధర్భంగా శివ కందుకూరి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సినిమా గురించి ఆయన ఆసక్తికరమైన విశేషాలు చెప్పుకొచ్చారు.

 

మీకు అసలు హీరో అవ్వాలని ఎప్పడు అనిపించింది ?

ఎప్పటినుండో యాక్టర్ అవ్వాలనే ఇంట్రస్ట్ అయితే ఉంది. కానీ, నేను యాక్టింగ్ కి సూట్ అవుతానా అనే చిన్న డౌట్ ఉండేది. యూఎస్ లో చదువుకుంటున్నప్పుడు లాస్ట్ టు ఇయర్స్ లో థియేటర్ ఆర్ట్స్ తీసుకున్నాను. అక్కడ నేను యాక్ట్ చేస్తోన్నప్పుడు నా యాక్టింగ్ కి మంచి స్పందన వచ్చింది. ఆ స్పందన చూశాక యాక్టింగ్ పై ఇంకా ఫ్యాషన్ పెరిగింది. అప్పుడే డిసైడ్ అయ్యాను యాక్టర్ గా ట్రై చెయ్యాలి అని.

 

ఫస్ట్ టైం మీ నాన్నగారితో యాక్టర్ అవుతానని చెప్పినప్పుడు ఆయన మీకు ఏం చెప్పారు ?

నాన్నగారు ఇండస్ట్రీ గురించి.. ఇక్కడ సక్సెస్ రేట్ చాల తక్కువ అని, అలాగే మనకు టాలెంట్ ఉన్న కొన్నిసార్లు మన సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ కారణంగా కూడా ఫెయిల్ అవ్వొచ్చు. ఏ పని చేసినా… ఏ స్క్రిప్ట్ ఒప్పుకున్న అందులో పూర్తి నిజాయితీ ఉండేలా చూసుకోమన్నారు. ఈ సినిమాకి మేం అదే చేశాము.

 

యాక్టర్ గా మీకు ప్రేరణ ఎవరు ? ఎవర్ని చూసి యాక్టర్ అవ్వాలనుకున్నారు ?

ఈ మాట చాలమంది చెప్పి ఉంటారు. నాకు మెగాస్టార్ చిరంజీవిగారు అంటే చాల ఇష్టం అండి. ఆయనే నాకు ప్రేరణ. చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ముఖ్యంగా సినిమా పట్ల ఆయనకున్న గౌరవం, ప్రేమ చాల గ్రేట్. ఆయన స్థాయి కాకపోయినా సినిమా బాగుంటే అది చిన్న సినిమా అయినా, ఆయన ఎంకరేజ్ చేస్తారు.

 

నిర్మాత కొడుకు అని మిమ్మల్ని ఈ సినిమాలో హీరోగా తీసుకోలేదని మీ నాన్నగారు చెప్పారు ?

అవునండి. మా డాడీ ఇప్పటికే మంచి సినిమాలు చేశారు. ఆయన తల్చుకుంటే పెద్ద డైరెక్టర్ ద్వారా కూడా నన్ను ఇండస్ట్రీకి పరిచయం చెయ్యొచ్చు. కానీ ఆయన ఓన్లీ కథే హీరో, స్క్రిప్ట్ ఒక్కటే మెయిన్ అని నమ్మే వ్యక్తి. ఆయనకు ఈ స్క్రిప్ట్ నచ్చింది, నా కోసం ఆయన ఈ సినిమా చెయ్యలేదు. అయితే డైరెక్టర్ నేను ఈ సినిమాలో బాగా సూట్ అవుతానని నమ్మడం వల్ల నన్ను ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది.

 

డైరెక్టర్ మిమ్మల్ని 12 రోజులు పాటు ఆడిషన్స్ చేశారట ?

మా డైరెక్టర్ శేష్ సింధూ రావ్ గారు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది. స్క్రిప్ట్ లో ఉన్న రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. దాదాపు 12 రోజులు పాటు ఆడిషన్ తీసుకున్నారు. ప్రతి సీన్ ఎలా చేస్తే బాగుంటుంది అని డిస్కస్ చేస్తూ రిహార్సల్స్ చేశాము.

 

‘చూసీ చూడంగానే’ సినిమా గురించి ?

ఏ లవ్ స్టోరీ తీసుకున్నా.. లైన్ వైజ్ గా ఒకేలా ఉంటాయి. అయితే ఈ సినిమాలో కొత్తదనం తీసుకురావడం కోసం పాత్రలతో పాటు వాటి నేపథ్యాన్ని కూడా కొత్తగా రాసుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే కామన్ అండ్ రియల్ ఇన్సిడెంట్స్ నే ఈ సినిమాలో ప్రధానాంశాలు. అవి కచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతాయి.

 

మీ తదుపరి సినిమాల గురించి ?

ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది, ప్రస్తుతం మరో సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. అలాగే కొత్త డైరెక్టర్ సృజనగారితో కూడా ఓ సినిమా చేస్తున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు