డైరెక్టర్ గా మారబోతున్న హీరో !
Published on Oct 16, 2017 5:11 pm IST

పూరి జగన్నాధ్ తమ్ముడు, హీరో సాయి రామ్ శంకర్ గతంలో పూరి దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసాడు. ఆ తరువాత ‘143’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు. ఈ మద్య అయన నటించిన గత్ కొన్ని సినిమాలతో పాటు ఇటీవలే విడుదలైన ‘నేనోరకం’ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు.

తాజా సమాచారం ప్రకారం సాయి రామ్ శంకర్ దర్శకుడిగా మారబోతున్నాడని తెలుస్తోంది. గతంలో తన అన్న దగ్గర కొన్ని సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసిన అనుభవంతో మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు. ఈ సినిమాలో ఆయనే హీరోగా నటిస్తుడడం విశేషం. కొత్త నిర్మాతలు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. సాయి ఈ సినిమాతో దర్శకుడిగా హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.

 
Like us on Facebook