ఒకప్పుడు టీ, సిగరెట్లు అందించానంటున్న స్టార్ హీరో.

Published on May 23, 2019 4:45 pm IST

కన్నడ పరిశ్రమకు చెందిన హీరో యశ్ అంటే ఇప్పుడు నేషనల్ వైడ్ గా క్రేజ్ ఉంది. అతను ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో చేసిన “కె.జి.ఎఫ్” సినిమా సంచలన విజయం అందుకుంది. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా సక్సెస్ అయ్యింది. .

ఐతే యష్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో స్టార్ డైరక్టర్స్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడట. ఆ టైంలో వాళ్లకి సిగరెట్లు, టీ లు అందించాడంట.ఈమధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాను పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. అఫ్కోర్స్ సినిమా కష్టాలు అందరికి ఉండేవే ఓ డ్రైవర్ కొడుకు అయిన యశ్ కన్నడలో రాక్ స్టార్ అవడానికి చాలా కష్టపడ్డాడని చెప్పొచ్చు. ప్రస్తుతం యష్ కెజిఎఫ్ సినిమా సీక్వెల్ లో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More