ఆ బోల్డ్ హీరోయిన్ చదువులలో కూడా సూపర్ అట.

Published on Jul 18, 2019 9:15 pm IST

బాలీవుడ్ శృంగార తార మల్లికా శెరావత్ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో అడపా దడపా సినిమాలు చేస్తున్నా మునుపటి ఆదరణ అయితే దక్కడం లేదు. దశాబ్దం క్రితం మర్డర్,క్వహిష్,వెల్కమ్,అగ్లీ పాగ్లీ వంటి పలు చిత్రాలలో మల్లిక తన మార్కు గ్లామర్ పాత్రలతో అలరించారు. ఐతే ఈ భామ యాక్టింగ్ లోనే కాదు,చదువులలో సూపర్ అంట.

ఆవిషయాన్ని తెలియజేస్తూ మల్లికా ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టడం జరిగింది. తన స్కూల్ డేస్ లో అకడమిక్స్ లో మంచి మార్కులు పొందినందుకుగాను, ఆమె మార్కర్స్ కప్ అందుకొందట. ఇన్నేళ్ల తరువాత ఆ తీపి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ పోస్ట్ పెట్టారు మల్లిక. హిందీతో పాటు,హిస్,ది మిత్,పాలిటిక్స్ అఫ్ లవ్,టైం ట్రావెలర్స్ అనే హాలీవుడ్,చైనీస్ చిత్రాలలో కూడా మల్లికా నటించడం జరిగింది.

సంబంధిత సమాచారం :