కరోనా టెస్టులు చేయించుకోనంటున్న నటి

Published on Jul 15, 2020 12:51 pm IST

సీనియర్ హీరోయిన్ రేఖ కోవిడ్ టెస్టులు చేయించుకోను అంటున్నారట. అలాగే తన ఇంటిని శానిటైజ్ చేయడానికి కూడా ఆమె ఒప్పుకోవడం లేదట. ఆమె ప్రవర్తన అధికారులను షాక్ కి గురిచేస్తుందట. కొద్దిరోజుల క్రితం రేఖ నివసించే బంగ్లా సెక్యూరిటీ గార్డుకు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీనితో ఆ ఇంటిలో ఉంటున్న రేఖతో పాటు సిబ్బంది మొత్తానికి కరోనా టెస్టులు నిర్వహించాలని అన్నారు. ఆ ఇంటిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి, శానిటైజ్ చేయడానికి సిద్ధం అయ్యారు.

కాగా ఇదే విషయం రేఖ మేనేజర్ కి ఫోన్ చేసి చెప్పగా మేడమ్ కరోనా సోకిన వారితో కలిసింది లేదు. కావున ఆమెకు కోవిడ్ టెస్ట్ నిర్వహించాల్సిన అవసరం లేదని అన్నారట. అలాగే తన ఇంటిని శానిటైజ్ చేయాల్సిన అవసరం లేదన్నారట. దీనితో బ్రహ్మీన్ ముంబై కార్పొరేషన్ సిబ్బంది కంగుతిన్నారట.

సంబంధిత సమాచారం :

More