ఇంటర్వ్యూ : అనుపమా పరమేశ్వరన్ – ఇండస్ట్రీలో అతనే నాకు బెస్ట్ ఫ్రెండ్
Published on Oct 28, 2017 3:33 pm IST


‘ఉన్నది ఒకటే జిందగీ’ లో మీ పాత్ర కు వస్తున్న స్పందన ఎలా ఉంది ?

నేను గతంలో పని చేసిన దర్శకులు, నా ఫేస్ బుక్, ట్విట్టర్ ఫాలో అయ్యేవారు మహా పాత్ర చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. వారి స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చాలా పాత్రలు చేనప్పటికి మహా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంది నాకు, నా ఒరిజినల్ కారెక్టర్ కు మహా పాత్రకు చాలా వ్యత్యాసం ఉంది.

మీ కెరీర్ ఏలా మొదలయ్యింది ?
నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని, మా ఇంట్లో నుండి సినిమాల్లో ఎవ్వరు లేదు, కాని నాకు నటన అంటే ఇష్టం, ఎలా అయిన సినిమాల్లోకి రావాలనే కోరికతో ప్రయత్నం చేసాను, ఇప్పుడు నేను ఈ స్థానంలో ఉన్నందుకు దేవుడికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి.

ఈ పాత్ర ను ఎలా ఒప్పుకున్నారు ?
డైరెక్టర్ ముందుగా ఈ స్టొరీ చెప్పినప్పుడు, నచ్చింది కాని నా పాత్ర చనిపోతుందని చెప్పడంతో డైరెక్టర్ గారిని అడిగాను, ”సార్ మీరు జోక్ చేస్తున్నారా” అని, కాని ఆయన నన్ను కన్వేన్స్ చేసారు, మంచి పాత్ర చెయ్యలనే ఆలోచనతో ముందుకు వెళ్ళాను. ఈరోజు అందరు నా పాత్ర గురించి మాట్లాడుకోవడం చూస్తుంటే గర్వంగా ఉంది.

స్టోరిని నమ్ముతారా ? కారెక్టర్ ని నమ్ముతారా ?
స్టోరి సినిమాకు హీరో కావున స్టోరినే ఎక్కువగా నమ్ముతాను, కథ బాగుంటే సినిమా చెయ్యడానికి అంగీకరిస్తాను, నా పాత్ర గురించి కూడా చూసుకుంటాను. సినిమాకు అవసమైతే గ్లామర్ పాత్రలు చెయ్యడానికి సిద్దం, కాని డైరెక్టర్ నా పాత్ర పట్ల పూర్తిగా క్లారిటి గా ఉండి, నన్ను కన్వేన్స్ చెయ్యగలిగితే చేస్తాను.

డైరెక్టర్, హీరో తో వర్క్ చెయ్యడం గురించి ?
చాలా సందడిగా జరిగింది, నాకు డైరెక్టర్ కథ చెప్పినప్పుడు కంటే షూటింగ్ జరుగుతున్నసమయంలో ఎక్కువ ఎంజాయ్ చేసాను, నాకు షూటింగ్ లేని సమయంలో కూడా సెట్ కు వెళ్లి సమీర్ గారికి, కిశోరే గారికి హెల్ప్ చేసేదాన్ని, చాలా సరదాగా జరిగిపోయింది. లవ్ టు వర్క్ విత్ రామ్.

ఇండస్ట్రీ లో మీకు బెస్ట్ ఫ్రెండ్ ?
చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా తోటి హీరోయిన్స్ అందరితో కలిసి ఉంటాను, సాయి పల్లవితో తరుచుగా మాట్లాడుతుంటా, నాకు ఇండస్ట్రి లో బెస్ట్ ఫ్రెండ్ అంటే హీరో శర్వానంద్.

మీ తదుపరి చిత్రాలు ?
ప్రస్తుతం నానితో ఒక సినిమా చేస్తున్నాను మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి డైరెక్టర్, అలాగే సాయి ధరమ్ తేజ్ తో ఒక లవ్ స్టోరి చేస్తున్న కరుణాకరన్ దర్శకత్వంలో.

 
Like us on Facebook