అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కు హీరోయిన్ దొరికింది !

Published on Feb 16, 2019 10:12 am IST

బ్లాక్ బ్లాస్టర్ తెలుగు మూవీ అర్జున్ రెడ్డి ని ఇటీవల కోలీవుడ్ లో ‘వర్మ’ పేరుతో రీమేక్ చేశారు. బాల దర్శకత్వంలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ నటించిన ఈ చిత్రంలో బెంగాలీ భామ మేఘ చౌదరి కథానాయికగా నటించింది. అయితే సినిమా పూర్తియ్యాక ప్రొడ్యూసర్స్ కు అవుట్ ఫుట్ నచ్చక పోవడంతో ధృవ్ తప్ప మిగితా అందరిని మార్చి మళ్ళీ రీషూట్ చేస్తామని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. అన్నట్లుగానే ఆ పనుల్లో వున్నారు.

ఇక మళ్ళీ కొత్తగా నిర్మించనున్న ఈచిత్రానికి తాజాగా హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. ఈచిత్రంలో హిందీ హీరోయిన్ భణిత సంధు ధృవ్ కు జోడిగా నటించనుంది. అయితే ఇంకా ఈ చిత్రానికి డైరెక్టర్ ను ఖరారు చేయలేదు. ఈ4 ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :