‘ఆచార్య’లో చెర్రీకి జోడీగా కనిపించబోయేది ఆమేనా ?

Published on Dec 5, 2020 2:00 am IST

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ ఇప్పటికే మొదలైపోయింది. కొన్నిరోజులు చిరు లేకుండానే షూటింగ్ చేశారు కొరటాల శివ. తాజాగా చిరు షూటింగ్లో అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిరు మీద యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. కాగా సినిమాలో రామ్ చరణ్ కూడ ఒక కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్నాళ్లపాటు సినిమాలో చరణ్ కు జోడీగా ఎవరు నటిస్తారనేది రివీల్ కాలేదు.

మధ్యలో పలువురు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వినిపించినా ఇప్పుడు మాత్రం యంగ్ అండ్ లేటెస్ట్ సెన్సేషన్ రష్మిక మందన్న కథానాయకిగా ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ‘ఆచార్య’ టీమ్ నుండి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. జనవరి మూడో వారంలో ‘ఆచార్య’ సెట్లోకి అడుగుపెడతారట రామ్‌చరణ్‌. అప్పుడే రష్మిక కూడా షూటింగ్‌లో పాల్గొంటుందని, ఒకే షెడ్యూల్లో వీరిద్దరికీ సంబంధించిన చిత్రీకరణను పూర్తిచేస్తారని ఫిల్మ్ నగర్ టాక్. కొరటాల తన ఎవరు గ్రీన్ ఫార్ములా అయినా కమర్షియాలిటీ, సోషల్ మెసేజ్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More