కొరటాల సినిమాలో ‘మెగాస్టార్’ సరసన.. ?

Published on Jul 29, 2019 4:37 pm IST

కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ కోసం గతకొంతకాలంగా కొరటాల పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నాడు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న ఈ సినిమా అధికారికంగా ప్రారంభం కానుంది.

ఇక కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారట. రచయితగా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ దర్శకుడిగా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ఇక మెగాస్టార్, ప్రస్తుతం స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ సైరా నర్సింహారెడ్డి’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.

సంబంధిత సమాచారం :