వారిద్దరిలో ఎన్టీఆర్‌ కు జోడీ ఎవరో ?

Published on Jul 19, 2021 9:00 am IST

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రానున్న పాన్ ఇండియా మూవీలో ఎన్టీఆర్‌ కు జోడీగా కియారాను తీసుకోనున్నారని వార్తలు బలంగా వినిపించాయి. కారణం ఆ మధ్య కియారా సోషల్‌ మీడియా చేసిన చిట్ చాట్ లో ఫ్యాన్స్ తో మాట్లాడుతూ.. ‘త్వరలో మరో తెలుగు సినిమా అప్ డేట్ వినిపిస్తా’ అంటూ చెప్పింది. ఆ అప్ డేట్ ఎన్టీఆర్ సినిమా కోసమే అని బాగా ప్రచారం జరిగింది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను అనుకుంటున్నారని కూడా బాగా వార్తలు వచ్చాయి. మరి ఈ భామల్లో ఎన్టీఆర్ కు జోడీగా ఎవరిని తీసుకుంటారనేది చూడాలి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల శివ సినిమా పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.

గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. పైగా ఇది ఈ సినిమాలో ఎక్కువగా బాలీవుడ్ కాస్టింగ్ ఉంటుందట.

సంబంధిత సమాచారం :